: బీఫ్ ఎగుమతి సంస్థల నుంచి బీజేపీకి భారీ విరాళాలు!


బీఫ్ మాంసాన్ని ఎగుమతి చేసే సంస్థల నుంచి భారతీయ జనతా పార్టీకి భారీగానే విరాళాలు ముట్టాయి. ఈ విషయం బీజేపీకి విరాళాలిచ్చిన నివేదిక ద్వారా తెలిసింది. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బీజేపీకి విరాళాలిచ్చిన వారి నివేదికను గత నవంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించింది. ఫ్రిగోరిఫికో అల్లానా లిమిటెడ్, ఫ్రిగెరియో కన్వర్వా అల్లానా లిమిటెడ్, ఇందాగ్రో ఫుడ్స్ లిమిటెడ్ సంస్థలు రూ.2 కోట్లు (2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల వరకు ) విరాళంగా ఇచ్చాయి. ఈ మూడు కంపెనీలు అల్లానా సన్స్ లిమిటెడ్ కు చెందినవే. అల్లానా హౌస్, అల్లానా రోడ్, కొలాబా, ముంబయి పేరిట ఈ సంస్థల చిరునామా రిజిష్టర్ చేసి ఉంది. 2014-15లో బీజేపీకి పార్టీ ఫండ్ గా ఫ్రిగోరిఫికో అల్లానా లిమిటెడ్ రూ.50 లక్షలు ఇచ్చింది. ఈ లావాదేవీలన్నీ విజయబ్యాంక్ ద్వారా జరిగాయి.

  • Loading...

More Telugu News