: రైల్వే బడ్జెట్ కు ప్రజల నుంచి సలహాలు స్వీకరించబోతున్న రైల్వేశాఖ
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైల్వే బడ్జెట్ కు సలహాలు స్వీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2016-17 సంవత్సరానికిగాను పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ముందుగా ఆన్ లైన్ లో సలహాలు స్వీకరించనుంది. జనవరి 15 వరకు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. ప్రజలు పంపే సలహాల ద్వారా రైల్వే బడ్జెట్ లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుంది.