: ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ అధ్యక్షురాలిగా పంచుమర్తి అనురాధ
ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ అధ్యక్షురాలిగా టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ పాలకమండలి నియామకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో డైరెక్టర్లుగా బి.లక్ష్మి, జి.మేఘలాదేవి, మసాల పద్మజ, చిత్రచేదు విశాలక్ష్మి, వైవి రాజేశ్వరిదేవిలను నియమించారు. వారంతా రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.