: చైనాలో 'తాజా గాలి'ని అమ్ముతూ లాభపడుతున్న కెనడా కంపెనీ!


గాలండోయ్ గాలి, తాజా గాలి, పర్వతాల నుంచి తీసుకువచ్చిన ఫ్రెష్ గాలి, కొని పీల్చండి, కాలుష్యం నుంచి తప్పించుకోండి... చైనాలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలను హరిస్తున్న వేళ, కెనడాకు చెందిన కంపెనీ పర్వతాల నుంచి తెచ్చిన గాలిని బాటిళ్లలో నింపి ఒక్కోటీ 28 డాలర్లకు (సుమారు రూ. 1876)కు విక్రయిస్తూ భారీ లాభాలను ఆర్జిస్తోంది. ఈ నెలారంభంలో తొలిసారిగా బీజింగ్ కాలుష్యంపై రెడ్ అలర్ట్ ను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని అనువుగా మలచుకున్న 'వైటాలిటీ ఎయిర్' అనే కెనడా సంస్థ ప్రీమియం, నార్మల్ పేరిట రెండు రకాల ఆక్సిజన్ బాటిళ్లను విక్రయిస్తోంది. వీటిని కెనడాలోని బాన్ఫ్ మరియు లేక్ లూయిస్ పర్వతాల్లో నింపామని చెబుతూ విక్రయిస్తోంది. లేక్ లూయిస్ లో నింపిన ప్రీమియం ఎయిర్ బాటిల్ ఖరీదు 27.99 డాలర్లు కాగా, బాన్ఫ్ గాలి ధర 23.99 డాలర్లు. తొలి విడతగా తాము తెచ్చిన బాటిళ్లన్నీ ఈ-కామర్స్ వెబ్ సైట్ 'తావోబావ్'లో అమ్మకానికి ఉంచగా, నిమిషాల్లో అన్నీ అయిపోయాయని వైటాలిటీ ఎయిర్ చైన్ ప్రతినిధి హారిసన్ వాంగ్ తెలిపారు. అతి త్వరలో 700 బాటిళ్ల తాజా గాలి చైనాలోకి రానుందని, వాటిని తదుపరి దశలో విక్రయిస్తామని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మన నెటిజన్లు, త్వరలో ఇండియాలోనూ ఇదే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News