: ఘనంగా టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి జన్మదిన వేడుకలు


టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా తెనాలిలోని తన నివాసంలో తెలుగుదేశం నేతలు, అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యడ్లపాటికి నారా లోకేశ్, స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన యడ్లపాటి శాసనసభ్యునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆలపాటి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, దూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News