: ధోనీ ఎందులో ఉంటే అదే ఫేవరెట్: గవాస్కర్


భారత క్రీడల్లో టీమిండియా కెప్టెన్ ధోనీకి మించిన బ్రాండ్ లేదని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్పష్టం చేశారు. ధోనీ ఏ టీమ్ లో ఉంటే అదే ఫేవరెట్ టీమ్ అని చెప్పారు. ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ పూణెకు ధోనీ కెప్టెన్ గా ఉండటంతో ఆ జట్టు ఫేవరెట్ గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. మరో కొత్త జట్టు రాజ్ కోట్ కు భారత క్రికెటర్ నే కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుందని సూచించారు. భారతీయ ఆటగాడికైతే స్థానిక ఆటగాళ్ల ప్రతిభపై అవగాహన ఉంటుందని చెప్పారు. ఒక వేళ కోచ్ గా భారతీయుడిని తీసుకుంటే... కెప్టెన్ గా బ్రెండన్ మెక్ కల్లమ్ ను తీసుకోవచ్చని అన్నారు. తాజా వేలంలో సురేష్ రైనా, రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్, ఆసీస్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ లను రాజ్ కోట్ జట్టు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే గవాస్కర్ స్పందిస్తూ, ఏ కొత్త జట్టుకైనా ధోనీలాంటి ఆటగాడు అవసరమని... రాజ్ కోట్ తో పోలిస్తే, పూణెనే బలంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News