: రాజకీయ దుమారం రేగినా వెనక్కు తగ్గని సీబీఐ...కేజ్రీ సెక్రటరీపై కొనసాగుతున్న విచారణ


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సంచలనాలు, విమర్శలు, ఆరోపణలు కొత్తేమీ కాదు. దేశంలో వెలుగుచూస్తున్న కీలక కేసుల దర్యాప్తు బాధ్యతలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఆ సంస్థకు ఒత్తిడులు కూడా కొత్తేమీ కాదు. అందుకేనేమో, నిన్నటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై జరిగిన సోదాలు దేశవ్యాప్తంగా పెను కలకలం రేపినా, సీబీఐ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఢిల్లీ సీఎం పేషీలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న రాజేంద్ర కుమార్ ను ఢిల్లీలోని తన కార్యాలయానికి పిలిపించిన సీబీఐ అధికారులు నిన్నటి సోదాలకు సంబంధించి వెలుగుచూసిన అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేటి ఉదయం ప్రారంభమైన ఈ విచారణ పర్వం రాత్రి దాకా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

  • Loading...

More Telugu News