: ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్?... మరింత మంది కోసం గాలింపు


దేశ రాజధాని ఢిల్లీలో రోజుల తరబడి పోలీసులు చేస్తున్న సోదాలు ఎట్టకేలకు ఫలించాయి. అంతేకాక నిన్నటిదాకా కాస్తంత తాపీగానే తనిఖీలు చేసిన పోలీసులు నిన్న రాత్రి నుంచి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులపై దాడులకు తెగబడేందుకు పాకిస్థాన్ నుంచి పలువురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా నిన్న రాత్రి ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు సమాచారం. విచారణలో భాగంగా మరింత మంది ఉగ్రవాదులు ఢిల్లీలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఢిల్లీ కాప్స్ షాక్ కు గురయ్యారు. ప్రముఖులపై దాడులకు మాటు వేసి ఉన్న సదరు ఉగ్రవాదుల కోసం ప్రస్తుతం నగర పోలీసులు సోదాలను మరింత ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News