: కేజ్రీకి మద్దతుగా దీదీ ట్వీట్!... ఇక మీ వంతేనని నెటిజన్ల రీ ట్వీట్స్


ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై నిన్న జరిగిన సీబీఐ సోదాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘సీఎం కార్యాలయానికి సీల్ వేయడం ఎప్పుడూ లేదు. నేను షాకయ్యాను’’ అంటూ నిన్న ఉదయం 11.18 గంటలకు ట్వీటిన దీదీ, ఢిల్లీ సీఎంకు మద్దతు పలికారు. దీనికి కేజ్రీ కూడా వెనువెంటనే స్పందించారు. సీబీఐ సోదాలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ తర్వాత దీదీ తన రోజువారి వ్యాపకాల్లో మునిగిపోయారు. తీరా సాయంత్రం తన ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన మమతకు షాక్ తగిలినంత పనైంది. కేజ్రీకి మద్దతు పలుకుతూ తాను పోస్ట్ చేసిన ట్వీట్ కు వేలాది మంది నెటిజన్లు ఘాటుగా స్పందించారు. చాలా మంది శారదా చిట్ ఫండ్ స్కాంను ప్రస్తావిస్తూ ‘ఇక తదుపరి మీ వంతే’నని రీ ట్వీట్ చేశారు. మరికొందరేమో ‘‘అది బెంగాల్ పోలీస్ కాదు... సీబీఐ’’ అంటూ ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News