: అజ్ఞాతంలోకి తమిళ నటుడు శింబు... ఆచూకీ కోసం పోలీసుల వేట


బూతు పదాలతో పాట రాయడమే కాక దానిని స్వయంగా పాడి, సదరు పాటను వాట్సప్ లో పెట్టిన తమిళ నటుడు శింబు అరెస్ట్ ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. మహిళలను అగౌరవపరిచేలా ఉన్న సదరు పాటపై అఖిల భారత మాదర్ సంఘం చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో శింబుతో పాటు ఆ పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడు అనిరుధ్ పై కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన మరుక్షణమే శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక అనిరుధ్ ప్రస్తుతం కెనడాలో ఉన్నాడు. దీంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు వారిద్దరి ఇళ్ల తలుపులకు సమన్లను అంటించి వచ్చారు. తమిళనాడులోనే కాక దక్షిణాది వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కాని తనకు కనిపించొద్దని కోవై రేస్ కోర్సు పోలీసులకు చెన్నై పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు శింబు కోసం చెన్నైని జల్లెడ పడుతున్నారు. ఇక కెనడా పర్యటన ముగించుకుని నేడు చెన్నైకి తిరిగిరానున్న అనిరుధ్ ను ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు శింబు ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News