: చెన్నైలో ‘ఎల్ జీ’ ఉచిత సర్వీసు క్యాంపు
చెన్నైలో వరదల కారణంగా దెబ్బతిన్న గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఉచితంగా బాగు చేసేందుకు గాను ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్ జీ సర్వీస్ క్యాంపును ప్రారంభించింది. ఎటువంటి రుసుం తీసుకోమని సంస్థ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, పాడైపోయిన సంబంధిత విడిభాగాలను రీప్లేస్ చేసుకునేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ వినియోగదారుల సేవా విభాగం అధిపతి వినోద్ కుమార్ తెలిపారు. వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఉచిత సర్వీస్ క్యాంపును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.