: 29 మంది జర్నలిస్టులను హతం చేశారు... ఇరాక్ లో ఘోరం


కల్లోలిత ఇరాక్ లో జర్నలిస్టుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో 29 మంది జర్నలిస్టులు హతమయ్యారు. వీరిలో 20 మందిని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కాల్చి చంపింది. ఐఎస్ వ్యతిరేక పోరాటాలను కవర్ చేస్తున్న క్రమంలో మరో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ తో పాటు, ఇతర నగరాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మిగిలిన ఆరు మంది చనిపోయారు. మరోవిషయం ఏమిటంటే... ఇరాక్ వ్యవహారాల్లో అమెరికా తల దూర్చినప్పటి (2003) నుంచి ఇప్పటి వరకు 435 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. సరైన చట్టాలు లేకపోవడం, నిర్వీర్యమైన ప్రభుత్వ వ్యవస్థల కారణంగానే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News