: కాలుష్యం తగ్గించి ఆ క్రెడిట్ మీరే కొట్టేయొచ్చుకదా?: సుప్రీంకోర్టు


ఢిల్లీని కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆ క్రెడిట్ మీరే కొట్టేయొచ్చుకదా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసి వాయు కాలుష్యాన్ని ఎందుకు అదుపు చేయకూడదని ప్రశ్నించింది. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన సదవకాశం వదులుకోకుండా, కాలుష్య నివారణకు చర్యలు తీసుకుని ఆ క్రెడిట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డీజిల్ కార్లను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్ధానం ఈ వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News