: మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి: రవిశంకర్ ప్రసాద్


ప్రధాని నరేంద్ర మోదీ ఓ సైకో, పిరికిపంద అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. సీబీఐ దాడులు నిర్వహించడానికి ముఖ్యమంత్రి పర్మిషన్ అవసరం లేదని చెప్పారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాడి చేసే అధికారం సీబీఐకి ఉంటుందని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సమర్థించడం కేజ్రీవాల్ కు తగదని అన్నారు. మరోవైపు, కేజ్రీవాల్ కార్యాలయంలో తాము దాడులు చేసినట్టు వచ్చిన వార్తలను సీబీఐ ఖండించింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ కొట్టిపడేసింది.

  • Loading...

More Telugu News