: చెన్నై వరద బాధితులకు అక్షయ్ కుమార్ సాయం


బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ చెన్నై వరద బాధితుల సహాయార్థం విరాళం అందించాడు. కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చినట్టు అక్షయ్ తెలిపాడు. చెన్నై వరదలు తనను ఎంతో కలచి వేశాయని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. "చెన్నై వరద దృశ్యాలు చూసి చలించిపోయిన అక్షయ్ కుమార్ తనవంతు సాయం చేయాలని భావించారు. వెంటనే దర్శకుడు ప్రియదర్శన్, నటి సుహాసినికి ఫోన్ చేశారు. సుహాసిని సలహా మేరకు భూమిక ట్రస్టుకు రూ.కోటి అందించారు" అని అక్కీ ప్రతినిధులు పేర్కొన్నారు. చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు భూమిక ట్రస్టు విశేష సేవలు అందిస్తోంది. అక్షయ్ నుంచి భూమిక ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, దర్శకనిర్మాత జయేంద్ర విరాళ చెక్కును అందుకున్నారు. నటుడు షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'దిల్ వాలే' చిత్ర బృందం కూడా చెన్నై వరద బాధితులకు కోటి రూపాయల విరాళం అందించింది.

  • Loading...

More Telugu News