: స్కైప్ ద్వారా పండిట్ రవిశంకర్ కు కేసీఆర్ ఆహ్వానం
ఈ నెల 23న తలపెట్టిన అయుత చండీయాగానికి సీఎం కేసీఆర్ స్వయంగా పలువురిని ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ ను ఆయన విభిన్నంగా ఆహ్వానించారు. షిల్లాంగ్ లో ఉన్న రవిశంకర్ తో స్కైప్ లో వీడియో కాల్ ద్వారా సీఎం మాట్లాడారు. 23 నుంచి జరిగే యాగానికి రావాలని కోరారు. ఇందుకు స్పందించిన రవిశంకర్.... తప్పకుండా యాగానికి వస్తానని చెప్పారు. యాగం ద్వారా తెలంగాణ ప్రజల్లో సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.