: విండీస్ క్రికెట్ ను బతికించుకోవాలంటే లారాను రంగంలోకి దించాలి: వార్న్


వెస్టిండీస్ లో క్రికెట్ ను బతికించుకోవాలంటే బ్రియాన్ లారాను రంగంలోకి దించాలని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సలహా ఇచ్చాడు. సిడ్నీలో వార్న్ మాట్లాడుతూ, గత కొంత కాలంగా వెస్టిండీస్ క్రికెట్ తిరోగమనంలో సాగుతోందని అన్నాడు. పేలవమైన ఆటతీరుతో అభిమానుల్లో ఆసక్తి పెంచలేకపోతున్నారని, ఇది క్రికెట్ కు చేటు చేస్తుందని వార్న్ అభిప్రాయపడ్డాడు. విండీస్ క్రికెట్ ను బతికించుకోవాలంటే జట్టులోని కీలక బాధ్యతలు బ్రియాన్ లారాకు అప్పగించాలని వార్న్ స్పష్టం చేశాడు. ఈ మధ్య కాలంలో వెస్టిండీస్ కనీసం పోరాడకుండానే చేతులెత్తేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లారా రికార్డులను చూస్తే ఆయన ఎంత సమర్థుడో అర్ధమవుతుందని, విండీస్ క్రికెట్ బోర్డు మేలుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలని వార్న్ సూచించాడు. కాగా, హోంబర్ట్ లో జరిగిన టెస్టులో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో పరాజయం పాలైన నేపథ్యంలో షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News