: సినిమా సెట్ లో సందడి చేసిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సినిమా సెట్లో సందడి చేశాడు. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' పేరిట ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు. తన జీవిత కథ ఎలా తెరకెక్కుతుందో చూడాలని ధోనీ ఈ సినిమా సెట్ కు వెళ్లాడు. దీంతో సినిమా యూనిట్ మొత్తం సంతోషంలో మునిగిపోయిందని ధోనీ తండ్రి పాత్రలో నటిస్తున్న అనుపమ్ ఖేర్ తెలిపాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News