: ఏడాదిలో 310 మంది తీవ్రవాదులను ఉరి తీసిన పాక్
16 డిసెంబర్ 2014న పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు విరుచుకుపడి 150 మంది విద్యార్థులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీంతో మేల్కొన్న పాక్ ప్రభుత్వం అప్పటి వరకు ఉరి శిక్షపై ఉన్న నిషేధం ఎత్తివేసింది. ఉగ్రవాదం పేరుతో దారుణాలకు పాల్పడి ఉరిశిక్ష పడ్డ ఖైదీలకు శిక్షను అమలు చేస్తోంది. యుఎన్, ఈయూ, మానవహక్కుల సంఘాలు ఉరి శిక్ష వద్దంటూ ఎంత వారించినప్పటికీ పాకిస్థాన్ పట్టించుకోలేదు. తాజాగా, ముల్తాన్, బహవల్పూర్, గుజరాత్ వంటి జైళ్లలో ఉన్న 8 మంది ఖైదీలను ఉరి తీశారు. దీంతో గత ఏడాది కాలంలో పాకిస్థాన్ లో 310 మంది ఉగ్రవాదులు ఉరికొయ్యలకు వేలాడారు. ఉరి శిక్ష ఉగ్రవాదుల్లో భయం పుట్టిస్తుందని, యువకులు ఉగ్రవాదం వైపు మళ్లడాన్ని అరికడుతుందని పాకిస్థాన్ అభిప్రాయపడుతోంది.