: బ్రెజిల్ విమానానికి బాంబు బెదిరింపు!
తాజాగా మరో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బ్రెజిల్ కు చెందిన టామ్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సంఘటన స్పెయిన్ లో జరిగింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి సావో పాలో బయలుదేరిన ఆ విమానం మొరాకో మీదుగా వెళ్తుండగా ఈ బెదిరింపులు వచ్చినట్లు స్పెయిన్ అధికారులు చెప్పారు. దీంతో విమానాన్ని తిరిగి మాడ్రిడ్ ఎయిర్ పోర్టుకు మళ్లించామని, సురక్షితంగా విమానం చేరుకుందని వారు పేర్కొన్నారు.