: సీమాంధ్రుల ఓట్లే కేసీఆర్ టార్గెట్: బీజేపీ


మొన్నటి దాకా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటు మార్చారని టి.బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. కేవలం రాజకీయ లబ్ధిలో భాగంగానే విజయవాడకు వెళ్లి, చంద్రబాబుతో కేసీఆర్ భేటీ అయ్యారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ పర్యటన జరిగిందని చెప్పారు. హైదరాబాద్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకోవడానికే చంద్రబాబును కేసీఆర్ కలిశారని అన్నారు. హైదరాబాద్ ఓటర్లను ఆకట్టుకోవడానికి కేసీఆర్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News