: కాల్ మనీ వ్యవహారంలో... వైసీపీ నేత మర్రి రాజశేఖర్ నివాసంలో సోదాలు


సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంలో గూంటురు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. దానిపై ఆయన మండిపడ్డారు. తనను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ఇంటికి పోలీసులను పంపారని ఆరోపించారు. 30 మంది పోలీసులతో తన ఇంట్లో సోదాలు చేసినా చిన్న ఆధారం కూడా దొరకలేదని చెప్పారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేగాక కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతలు కూరుకుపోయారని, ప్రజల దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామని మరో వైసీపీ నేత మనోహర్ నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News