: తమిళనాడు వరద బాధితులకు అన్నాడీఎంకే ఎంపీల విరాళం
తమిళనాడు వరద బాధితులకు అన్నాడీఎంకే ఎంపీలు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితుల సహాయార్థం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ తెలిపారు. అంతేగాక బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆ రాష్ట్ర సీఎం జయలలిత ప్రకటించారు. ప్రజలు కంగారు పడొద్దని, తప్పకుండా అందరినీ ఆదుకుంటామని చెప్పారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్న వారిని జయ ఈ సందర్భంగా అభినందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రం జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.