: కాల్ మనీ కేసులో దేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడి అరెస్ట్


సంచలనం రేపిన బెజవాడ కాల్ మనీ వ్యవహారంలో మరో తిమింగలాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావును కొద్ది సేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ మనీ వ్యాపారం చేస్తున్న ఆయన, పలువురు మహిళలను ఇబ్బందులు పెట్టినట్టు ఫిర్యాదులు రావడంతోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, నిన్న బుద్ధా మీడియాతో మాట్లాడుతూ, తన సోదరుడిని అరెస్ట్ చేసినా తాను పట్టించుకోబోనని వెల్లడించిన సంగతి తెలిసిందే. నాగేశ్వరరావు ఇంటిపై దాడులు జరిపిన పోలీసులు ప్రజలు సంతకాలు చేసిన ఖాళీ స్టాంపు పేపర్లను పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News