: సెలవుపై వెళుతున్న విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్... 'కాల్ మనీ' ఒత్తిళ్లే కారణం?
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళుతున్నారు. 15 రోజుల సెలవు కావాలని ఆయన పై అధికారులను అభ్యర్థించారు. పరిశీలించిన అధికారులు వెంటనే సెలవు మంజూరు చేశారు. దాంతో కొన్నిరోజుల పాటు ఆయన విరామం తీసుకుంటున్నారు. అయితే సవాంగ్ ఇలా వెళ్లడానికి కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయపరంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమని సమాచారం. ఆయన స్థానంలో నగర ఇన్ చార్జ్ సీపీగా సురేంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.