: న్యూజిలాండ్ కొత్త జాతీయ జెండా నమూనాకు ఆమోదం


న్యూజిలాండ్ నూతన జాతీయ జెండా నమూనాకు ఆమోదం లభించింది. డిజైన్ ఎంపిక కోసం జరిగిన ప్రత్యేక పోలింగ్ లో కొత్తగా రూపొందించిన డిజైన్ కే అత్యధిక ఓట్లు పడ్డాయి. నీలం, నలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ పై సిల్వర్ చెట్టు ఆకు (న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ధరించే లోగో), పక్కనే ఎరుపు రంగులో నాలుగు నక్షత్రాలు ఉన్న డిజైను రూపొందించారు. ఈ క్రమంలో కొత్త డిజైన్ పాత జెండాతో పోటీపడేందుకు అర్హత సాధించినట్లైందని అంటున్నారు. అయితే జాతీయ జెండా మార్పుకు సంబంధించిన అసలు ఎన్నిక వచ్చే ఏడాది మార్చిలో జరగనుందట. కాగా కొత్త జెండా కోసం ఆ దేశ ప్రజలు దాదాపు 10వేల డిజైన్లు పంపారట.

  • Loading...

More Telugu News