: విజయవాడలో టీడీపీ కార్పోరేటర్ కనకదుర్గ ఇంట్లో తనిఖీలు... ఆమె భర్త అరెస్టు


విజయవాడలోని పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఈ ఉదయం నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని చిట్టినగర్ లో టీడీపీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ నివాసంలో కూడా తనిఖీలు చేశారు. ఆమె భర్త కొండ కాల్ మనీ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి సోదాలు జరిపారు. కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం కొండను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోపాటు మరికొంతమంది కాల్ మనీ వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News