: కేజ్రీవాల్ కార్యాలయాన్ని సీజ్ చేయలేదు: సీబీఐ


దేశ రాజధాని ఢిల్లీ సచివాలయంలో ఇవాళ సీబీఐ సోదాలు జరిపిందని, సీఎం కార్యాలయాన్ని సీజ్ చేసిందంటూ కేజ్రీవాల్ ప్రకటించడంపై సీబీఐ స్పందించింది. కేజ్రీ కార్యాలయాన్ని తాము సీజ్ చేయలేదని వెల్లడించింది. అంతేగాక సోదాలు నిర్వహించినట్టు వస్తున్న వార్తలను కూడా సీబీఐ ఖండించింది. తాము సీఎం కార్యాలయంలో తనిఖీలు చేపట్టలేదని, కేవలం ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం సీబీఐ సోదాలను తీవ్రంగా ఖండించింది. తనిఖీలకు వచ్చిన అధికారులు ఎలాంటి పేపర్స్ చూపలేదని ఆప్ వివరించింది.

  • Loading...

More Telugu News