: బీహార్, జార్ఖండ్ లలో భూప్రకంపనలు... బయటకు పరుగులు తీసిన ప్రజలు!
కొద్దిసేపటి క్రితం బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. బీహార్ లోని గయ, జముయ్ తదితర ప్రాంతాల్లో, జార్ఖండ్ లోని దేవగఢ్, ధన్ బాద్ ఏరియాల్లో భూమి కంపించగా, ప్రజలు ఆందోళనతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. దేవగఢ్ కు దగ్గర్లో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని, అంతకుమించి పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.