: 'ఎముకలు విరుస్తా' అన్న బల్గేరియన్ బాక్సర్ కు విజేందర్ చిరునవ్వే సమాధానం!
మరో నాలుగు రోజుల్లో బౌట్ లో తలపడనున్న బల్గేరియా బాక్సర్ సామెటో హ్యుసెనోవ్, విజేందర్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజేందర్ ను ఉద్దేశించి, "నీ ఎముకలు విరగ్గొట్టి ఇండియాకు పంపిస్తా" అని సామెటో అంటే, దాన్ని విన్న విజేందర్ ఓ చిరునవ్వు నవ్వి, తానో ఒలింపిక్స్ విజేతనని, సామెటోకు తన సమాధానం రింగులోనే తెలుస్తుందని అన్నాడు. అతను ప్రొఫెషనల్ అయినా, తాను మాత్రం తక్కువేమీ కాదని, సామెటోకు తనేంటో అర్థమయ్యేలా చెబుతానని అంటున్నాడు. వీరిద్దరూ 19వ తేదీన తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా, విజేందర్ ఇటీవలి తన రెండు ప్రొఫెషనల్ బౌట్లలో బాక్సర్లను నాకౌట్ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.