: ‘షాపింగ్’కు ఢిల్లీ నెంబర్ వన్!


షాపింగు చేయడానికి ఆసియా ఖండంలోనే దేశ రాజధాని ఢిల్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 'ట్రిప్ అడ్వజైర్' తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. షాపింగ్ మాల్స్, పలురకాల వస్తువులు, మోడళ్లు, ప్రత్యేక మార్కెట్లకు ఢిల్లీ ప్రసిద్ధి అని ఈ సర్వే పేర్కొంది. ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత బ్యాంకాక్, సింగపూర్ దేశాలు ఉన్నాయని ట్రిప్ అడ్వజైర్ కమ్యూనికేషన్స్ డైరైక్టర్ జనీస్ లీ ఫాంగ్ పేర్కొన్నారు. షాపింగ్ చేయడానికి బాగుండే మిగిలిన దేశాల విషయానికొస్తే... చైనా రాజధాని బీజింగ్, వియత్నాం రాజధాని హనోయ్, జపాన్ రాజధాని టోక్యో, మలేషియా రాజధాని కౌలాలంపూర్, ఖాట్మండు, ఇండోనేషియా లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News