: భారత్-పాకిస్థాన్ మధ్య సిరీస్ జరుగుతుంది: అరుణ్ లాల్
భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అరుణ్ లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచేందుకు క్రికెట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అయితే ప్రస్తుతం క్రీడల్లో రాజకీయాలు ప్రవేశించిన కారణంగానే భారత్-పాక్ మధ్య సిరీస్ అభిమానులను అలరించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ దేశంతో అయినా ద్వైపాక్షిక సిరీస్ అంటే తాను మద్దతు పలుకుతానని ఆయన చెప్పారు. భారత్-పాక్ మధ్య ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో నైనా ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.