: నాలాగా క్రికెట్ ఆడాలని ఉందా?...అయితే ఇంకెందుకాలస్యం?: కోహ్లీ
నాలాగా క్రికెట్ ఆడాలనుందా? అయితే, ఇంకెందుకాలస్యం, ఈ గేమ్ ని డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లో ఆడేయండి అని అభిమానులకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. విరాట్ కోహ్లీ మొబైల్ గేమ్ ని సిఫారసు చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అంత ఆశ్చర్యానికి లోనుకాకండి. ఫిట్ నెస్ సెంటర్లు, ఫ్రాంచైజీలు, మరిన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ, మొబైల్ గేమింగ్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టాడు. దీంతో తన గేమ్ ను క్రికెట్ అభిమానులందరికీ సిఫారసు చేస్తున్నాడు. గూగుల్ యాప్ స్టోర్ లో విరాట్ క్రికెట్ ఛాలెంజ్ గేమ్ దొరుకుతుందని, దీనిని డౌన్ లోడ్ చేసుకుని, తనలాగే ఆడేయండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు.