: దానం తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలి: తలసాని
కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దానం నాగేందర్ కు హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. ఇతర పార్టీలపై నమ్మకం పోయిన నేతలే టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. అది ఆయా పార్టీలలో ఉన్న నేతలు తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు చేసేముందు ఆలోచించాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు.