: చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్ హత్య కేసులో ఓ వ్యక్తి అరెస్టు


ముంబైలో సంచలనం రేపిన ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్, ఆమె న్యాయవాది హరీశం భంభానీల హత్య కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ రెండు హత్యలతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న ఆ వ్యక్తి పేరు సాధు రాజ్ భర్ గా గర్తించారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్యల తరువాత సంబంధం ఉన్నవారు యూపీ పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దాంతో ముంబై పోలీసుల బృంద సభ్యులు అక్కడికే వెళ్లి విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News