: మియాపూర్ లో వాటర్ ట్యాంకర్ కావాలంటే రెండు నెలలు ఆగాల్సిందే!


వాటర్ ట్యాంకర్ కావాలంటే.. కనీసం రెండు నెలలు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి మియాపూర్ లో నెలకొంది. ఇందుకు కారణం.. మియాపూర్ సెక్షన్ పరిధిలో డిసెంబర్ 1 నుంచి ‘డయల్ ఏ ట్యాంకర్’ ద్వారా తీసుకున్న అన్ని ఆర్డర్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యుఎస్&ఎస్ బీ) రద్దు చేయడమే. ఈ సందర్భంగా హెచ్ఎండబ్ల్యుఎస్&ఎస్ బీ, మియాపూర్ సెక్షన్ మేనేజర్ నాగప్రియ మాట్లాడుతూ, మియాపూర్ సెక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ&ఎమ్) డివిజన్-XV లోని మెట్రో కస్టమర్ కేర్(ఎంసీసీ) కు వాటర్ ట్యాంకర్ కావాలని కోరుతూ 561 విన్నపాలు తమకు అందాయని అన్నారు. రోజుకు సుమారు 50 ట్రిప్పులు వేస్తుంటారని పేర్కొన్నారు. మియాపూర్ సెక్షన్ పరిధిలో సుమారు 400 అపార్టుమెంట్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, మంజీరా, సింగూర్ జలాలను రోజు విడిచి రోజు పద్ధతిలో మంచి నీటి సరఫరా జరుగుతుందన్నారు. రిజర్వాయర్లలో నీటి కొరత కారణంగానే వాటర్ ట్యాంకర్ల ద్వారా బుక్ చేసుకున్న వారికి నీటిని సరఫరా చేయలేకపోతున్నామన్నారు. మియాపూర్ లో మంచినీటి కొరత తీవ్రంగా ఉన్న కారణంగా డబ్బు చెల్లించి వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకున్న ఆర్డర్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆమె పేర్కొంది. ‘డయల్ ఏ ట్యాంకర్’ ను తాత్కాలికంగా రద్దు చేయడం వల్ల దీని ప్రభావం మయూరి నగర్, జేపీఎన్ నగర్, దీప్తి శ్రీ నగర్, మైత్రి నగర్, మియాపూర్ పరిధిలోని మదీనాగూడపై పడుతుందని హెచ్ఎండబ్ల్యుఎస్&ఎస్ బీకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

  • Loading...

More Telugu News