: బాంబుల్లేవు...కత్తులున్నాయి: దేవినేని నెహ్రూ
బాంబుల సంస్కృతి విజయవాడకు లేదని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తాను నెహ్రూ, గాంధీని కాదని అన్నారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపే వ్యక్తిత్వం కాదని అన్నారు. దానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పారు. తనపై రెండు హత్య కేసులు ఉన్నాయని నెహ్రూ వెల్లడించారు. విజయవాడలో బాంబుల సంస్కృతి లేదని, అయితే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తనకు ప్రైవేటు సైన్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని విమర్శించిన ప్రతి ఒక్కరూ కళంకితులేనని ఆయన తెలిపారు. కావాలంటే తాను నిరూపించగలనని ఆయన అన్నారు.