: గతంలో సత్కరించారు...ఇప్పుడు ఛీత్కరించారు


స్వయం ప్రకటిత దేవ దూత రాధేమా మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే, ఈసారి ఆమె ఎలాంటి పని చేయకపోయినా వార్తల్లో వ్యక్తి అయ్యారు. గతంలో రాధేమాకు 'మహామండలేశ్వర్' బిరుదును ప్రదానం చేసిన జునా అఖడా ఈసారి సింహస్థ ఉత్సవాల్లో ఆమె పాల్గొనకుండా నిషేధించినట్టు తెలిపింది. రాధేమాపై వరకట్న వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో గతంలో ఆమెకు ప్రదానం చేసిన మహామండలేశ్వర్ బిరుదును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. కాగా, దేశంలోని సాధువుల ప్రధాన సంస్థ అయిన జునా అఖడా నిర్ణయంపై రాధేమా సన్నిహితుడు 'తల్లి బాబా' మాట్లాడుతూ, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News