: చపాతీలు చేయాలని ఎన్నడూ అడగలేదు: నోరువిప్పిన ఇమ్రాన్ ఖాన్


గత అక్టోబర్ లో రెహామ్ తో విడిపోయిన తరువాత, క్రికెట్ లెజండ్, ప్రస్తుత పాక్ రాజకీయ వేత్త ఇమ్రాన్ ఖాన్ నోరువిప్పారు. ఆమె తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. ఇంట్లోనే ఉండాలని, చపాతీలు చేయాలని తాను ఎన్నడూ అడగలేదని అన్నారు. 'సీధీ బాత్' పేరిట ఆజ్ తక్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తనపై ఓ తప్పుడు ప్రచారాన్ని ఆమె చేసిందని అన్నారు. గృహ హింసకు పాల్పడినట్టు చూపాలని ప్రయత్నించిందని అన్నారు. కాగా, తనను ఇంట్లో బంధించి ఉంచాలని ఇమ్రాన్ చూశాడని, వంటింట్లో చపాతీలు తయారుచేయడానికే తనను పరిమితం చేయాలని భావించాడని ఆరోపిస్తూ, తమ 10 నెలల పెళ్లి బంధాన్ని తెంచుకుంటున్నట్టు రెహామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News