: సీరియస్ అయిన టీఎస్... భవిష్యత్ వేడుకలకూ దూరం!
తాము ఎంతో ఆసక్తితో రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనాలన్న కోరికతో మూడు శకట నమూనాలను పంపితే, వాటిని కేంద్ర హోం శాఖ తిరస్కరించడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ పక్ష నేత ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపై భవిష్యత్తులో ఎటువంటి శకటాలనూ పంపకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. తెలంగాణ శకటాలకు నిరాదరణే ఎదురౌతుందని తెలిసి కూడా నమూనాలు ఎందుకు పంపాలని, ఇకపై శకట డిజైన్లను పంపే సమస్యే లేదని వివరించారు.