: కేసీఆర్ చండీయాగం పూర్తిపేరు, ఆహ్వాన పత్రిక వివరాలివి!


కేసీఆర్ నేతృత్వంలో త్వరలో ప్రారంభం కానున్న అయుత చండీయాగం ఆహ్వాన పత్రికల పంపకాలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించిన కేసీఆర్, నేడు విజయవాడకు సతీ సమేతంగా వెళ్లి చంద్రబాబునాయుడు కుటుంబాన్ని ఆహ్వానించనున్నారు. చండీయాగం కోసం తయారు చేసిన సాధారణ ఆహ్వాన పత్రికలతో పాటు వీఐపీల కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలను తయారు చేయించారు. చండీమాత ముఖచిత్రంతో ఉన్న నాలుగు పేజీల పత్రికలో "జగజ్జనని చండీమాతను ప్రసన్నం చేసుకుని సకల జనాలకు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ పవిత్ర కార్యంగా అయుత చండీ మహాయాగాన్ని తలపెట్టాం" అని, తమరు తప్పక రావాలని కేసీఆర్ తన ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు. ఈ యాగాన్ని ‘చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పురశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం’ అని పిలుస్తారని చెబుతూ, నాలుగు రోజుల పాటు యాగం సందర్భంగా జరిగే కార్యక్రమాల వివరాలను గురించి ప్రస్తావించారు. ఇక యాగం నిర్వహించే ప్రాంతానికి ఎలా వెళ్లాలి? పార్కింగ్ ఎక్కడ? భోజనం, వసతి సదుపాయాలు ఎక్కడుంటాయి? తదితర వివరాలతో కూడిన మ్యాప్ ను నాలుగో పేజీలో ముద్రించారు.

  • Loading...

More Telugu News