: ముంబయిలో దారుణం.. హతమార్చి అట్టపెట్టెల్లో పెట్టారు!


జాతీయ లలిత కళా అకాడమీ, గుజరాత్ లలిత కళా అకాడమీ అవార్డుల గ్రహీత, ప్రముఖ చిత్ర కారిణి హేమ ఉపాధ్యాయ్ ని, ఆమె లాయర్ హరీష్ బంబానిని గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. ఆ మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి కాల్వలో పడేసిన దారుణ సంఘటన ముంబయిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... హేమ ఉపాధ్యాయ్ ని, ఆమె లాయర్ హరీష్ బంబానిని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి హతమార్చారు. ఆ మృతదేహాలను అట్ట పెట్టెల్లో కుక్కిపెట్టి.. ముంబయిలోని కందిల్వీ ప్రాంతంలోని ఒక శ్మశాన వాటిక పక్కనే ఉన్న కాలువలో పడేశారు. మర్నాడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన ఒక స్వీపర్ తమకు సమాచారం అందించాడని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హేమ భర్త చింతన్ కూడా చిత్రకారుడే. భర్తతో హేమకు విభేదాలున్నాయి. ఈ మేరకు భర్తపై పోలీసులకు ఆమె గతంలో ఫిర్యాదు చేసింది. ఈ కేసు వ్యవహారంలో లాయర్ బంబాని హేమకు సహకరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News