: 2017-18 నాటికి చంద్రయాన్-2 ప్రయోగం
2017-18 నాటికి అంతరిక్షంలోకి చంద్రయాన్-2ను పంపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. అంగారక ఉపగ్రహంపై దశల వారీగా ప్రయోగాలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరంగల్ ఎన్ఐటీ 13వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతమవడంతో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.