: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన బస్సు...ఐదుగురి మృతి!
పెళ్లి ఊరేగింపుపైకి ఒక బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. షాజహాన్ పూర్ లోని గాంగ్సరా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కాంగ్రెస్ నేత అరుణ్ బాజ్ పాయ్ (40), మోను(28) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శ్రీవాస్తవ(38), కౌషల్ కుమార్(40), రమేష్ మిశ్రా(37)లను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.