: 55వ పడిలో విక్టరీ వెంకటేష్... సెలబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ


నేడు 55వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్ కు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు హీరో హీరోయిన్లు, దర్శకులు గతంలో తాము వెంకటేష్ తో తీసుకున్న ఫోటోలను, సెల్ఫీలను పోస్ట్ చేస్తూ, అభినందనలు తెలిపారు. హీరో సుమంత్ "హ్యాపీ బర్త్ డే విక్టరీ వెంకటేష్ బావా" అంటే, హీరోయిన్ అనుష్క "విషింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారూ, ఏ వెరీ హ్యాపీ బర్త్ డే" అంటూ విషెస్ చెప్పింది. ఇక సాయికుమార్ "విషింగ్ 'విక్టరీ' వెంకటేష్ హ్యాపీ బర్త్ డే" అనగా, దగ్గుబాటి రానా "హ్యాపీ బర్త్ డే చిన్నాన్నా" అని, కమేడియన్ అలీ "విక్టరీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనతో ఎన్నో సినిమాలు కలిసి చేసినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. అందరూ మెచ్చే వ్యక్తి ఆయన. మరెన్నో సంతోషకరమైన సంవత్సరాలు ఆయన ముందున్నాయి" అని అన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ "విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే టు వెంకటేష్ సార్! హోప్ యూ హ్యావ్ ఏ సూపర్బ్ ఇయర్" అనగా, దర్శకుడు రాజమౌళి "విషింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారు, ఏ వెరీ హ్యాపీ బర్త్ డే!" అని తన శుభాకాంక్షలను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News