: 'కాల్ మనీ' వ్యవహారంలో దేశం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెబుతున్నది ఇదే!
విజయవాడలో వెలుగులోకి వచ్చిన కాల్ మనీ దందా వెనుక నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ తో కలసి విదేశీ టూర్ కు వెళ్లిన పెనమలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఈ ఉదంతంతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. "ఈ వ్యవహారంలో నాకేమీ సంబంధం లేదు. కేవలం శ్రీకాంత్ అనే వ్యక్తి నాకు స్నేహితుడు. అతను ఒక ఫైనాన్స్ వ్యాపారిగా మాత్రమే పరిచయం నాకు. గతంలో ఐదారు సంవత్సరాల నుంచి కూడా పార్టీ అభిమానిగా, నాకు కూడా అభిమానిగా పరిచయం. ఇటువంటి కాల్ మనీ వ్యవహారంలో అయితే, నేను పూర్తిగా అతనికి కూడా వ్యతిరేకం. కాల్ మనీ లావాదేవీలకూ వ్యతిరేకం. గతంలో కూడా చాలా మంది ఇలా... కాల్ మనీ వ్యవహారంలో నా దగ్గరికి వచ్చేవారు. వాళ్లల్లో కూడా నేను చాలా మందిని కూర్చోబెట్టి వాళ్లకు ఇబ్బందులు కలుగకుండా సెటిల్ చేసిన వ్యవహారాలూ ఉన్నాయి. నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలూ లేవు. నా స్నేహితుడిగా మాత్రమే శ్రీకాంత్ విదేశీ ట్రిప్ కు వచ్చాడు. అతను కూడా వేరే కంట్రీకి వెళ్లిపోయాడు. ఇద్దరమూ కలిసి వచ్చాం... వడ్డీ వ్యాపారం కాదండీ. అతను ఫైనాన్స్ వ్యాపారిగా మాత్రమే తెలుసు. నేను స్నేహానికి విలువనిస్తాను. స్నేహితుడైనా, అతనేదైనా తప్పు చేస్తే నేను ఖండిస్తాను. నాకైతే, అటువంటిది ఏమీ తెలియదండీ. శ్రీకాంత్ కోసం ఒకటి రెండు సార్లు కాల్ మనీ ఆఫీసుకు వెళ్లాను. అంతకుమించి అక్కడి వారితో ఎటువంటి పరిచయాలూ లేవు. ఆ శ్రీరామ్ అనే వ్యక్తిని శ్రీకాంత్ కోసం వెళ్లినప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రమే చూడటం తప్పితే, అరెస్ట్ చేసిన వారితో నాకెలాంటి పరిచయాలూ లేవు. నిజంగా ఈ రోజు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో రుజువులు చూపమనండి. వందకు వంద శాతం నా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా" అని బోడె ప్రసాద్ అన్నారు.