: ఏపీకి టీడీపీ చేసిందేమీ లేదు: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలనే, తమవిగా చంద్రబాబు సర్కారు చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో సోము వీర్రాజును బీజేపీ శ్రేణులు ఘనంగా సత్కరించగా, ఆ సభలో వీర్రాజు మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలని మొట్టమొదటగా కోరింది తానేనని స్పష్టం చేశారు. ఒక విధంగా టీడీపీ అధికారంలోకి రావడానికి తానే కారణమని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని చెప్పారు.