: కలకలం... రాజస్థాన్ లో ఐఎస్ఐఎస్ అనుకూల స్లోగన్లతో ర్యాలీ!
హిందూ మహాసభ కార్యకర్త కమలేష్ తివారీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాజస్థాన్ లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలో ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ కు, పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేయడం కలకలం సృష్టించింది. జైపూర్ సమీపంలోని మల్ పురాలో ముస్లింలు కమలేష్ కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. "ఈ ర్యాలీ ఓ మసీదు వద్ద ప్రారంభమై నగరమంతా సాగింది. కొందరు ఐఎస్ఐఎస్ కు అనుకూలంగా నినాదాలు చేశారు" అని ఎస్పీ దీపక్ కుమార్ వెల్లడించారు. కమలేష్ కు ఉరిశిక్ష విధించాలని, హిందూ మహాసభను నిషేధించాలని వారు ప్లకార్డులు ప్రదర్శించినట్టు తెలిపారు. మొత్తం ర్యాలీని వీడియో తీశామని, ఆ ఫుటేజ్ ఆధారంగా నినాదాలను మొదలు పెట్టిన ఐదుగురిని గుర్తించామని తెలిపారు. "ఐఎస్ఐఎస్ జిందాబాద్" అని కేకలు పెట్టిన ఘటనలో గుర్తు తెలిసిన, గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. ఇదిలావుండగా, ముజఫర్ నగర్ లో సమావేశమైన లక్షమంది ముస్లింలు, ప్రవక్తను అవమానించిన కమలేష్ తివారీని ఉరితీయాలని డిమాండ్ చేశారు.