: దేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై చంద్రబాబు సీరియస్


2019 పార్లమెంటు ఎన్నికల తరువాత నారా చంద్రబాబునాయుడు ప్రధాని అవుతారని, వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును అసహనానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు, రాజేంద్రప్రసాద్ ను మందలించారు. ఇటువంటి అనవసర వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులు పెట్టవద్దని టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు హెచ్చరించారు. తాను కేంద్రంలోకి వెళ్లాలని గతంలో భావించలేదని, ఇప్పుడు కూడా అనుకోవడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News