: ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణపై విచారణ: భన్వర్ లాల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న స్థానిక సంస్థల కోటా మండలి ఎలక్షన్స్ లో నామినేషన్లు ఉపసంహరించుకుంటున్న వారిపై ఒత్తిడి ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తామని ఈసీ భన్వర్ లాల్ వెల్లడించారు. అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం నేరమని అన్న ఆయన, ఐదు జిల్లాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్, నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన జిల్లాల్లో కోడ్ తొలగినట్టేనని తెలిపారు. కాగా, ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాల్లో 27న పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.